- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ముగిసిన గ్రూప్-2 అప్లికేషన్ గడువు.. ఎంతమంది అప్లై చేశారంటే?
by GSrikanth |
X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ గ్రూప్-2 దరఖాస్తు గడువు ముగిసింది. 783 గ్రూప్-2 ఉద్యోగాలకు గాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన దరఖాస్తు ప్రక్రియ గురువారం సాయంత్రం 4 గంటల వరకు పూర్తైందని టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ఈ మేరకు 5 లక్షల 50 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది.
మరికాసేపట్లో మొత్తం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సంఖ్య, పూర్తి వివరాలను టీఎస్పీఎస్సీ అధికారులు వెల్లడించనున్నారు. టీఎస్పీఎస్సీ గ్రూప్-2 అప్లికేషన్ల ప్రక్రియను జనవరి 18 ప్రారంభించింది. అయితే, గ్రూప్ 4 మాదిరిగా గ్రూప్ 2 దరఖాస్తు గడువు పొడిగిస్తారని ప్రచారం సాగింది. కానీ, గడువును పొడిగించే అవకాశం లేదని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది.
Advertisement
Next Story