ఆర్టీసీ ఉన్నతాధికారులతో గవర్నర్ సమావేశం

by Javid Pasha |   ( Updated:2023-08-06 08:23:07.0  )
ఆర్టీసీ ఉన్నతాధికారులతో గవర్నర్ సమావేశం
X

దిశ, వెబ్ డెస్క్: ఆర్టీసీ ఉన్నతాధికారులతో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సమావేశమయ్యారు. గవర్నర్ సమావేశంలో రవాణాశాఖ ముఖ్యకార్యదర్శితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ విలీనం బిల్లుపై గవర్నర్ వారితో చర్చించారు. ఆర్టీసీ బిల్లు వల్ల ఎంతమందికి లబ్ది కలుగుతోంది? కాంట్రాక్ట్ ప్రాతిపదికన పని చేస్తున్న కార్మికుల పరిస్థితి ఏంటీ? ఆర్టీసీకి ఉన్న ఆస్తులు ఎన్ని? వంటి తదితర విషయాల గురించి గవర్నర్ అధికారులను అడిగినట్లు తెలుస్తోంది.

తాను ఆర్టీసీ బిల్లుకు వ్యతిరేకం కాదని, కానీ ఆర్టీసీలోని ప్రతి కార్మికుడికి న్యాయం జరగాలని కోరుకుంటున్నట్లు ఆమె అధికారులకు తెలిపినట్లు సమాచారం. కాగా శనివారం రాష్ట్ర గవర్నర్ టీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఇదే విషయాన్ని గవర్నర్ వాళ్లకు తెలిపారు. కాగా ఈ భేటీ తర్వాతనైనా గవర్నర్ ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలుపుతారో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed