- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టోకెన్లు సరే.. రిలీజ్ ఎప్పుడు?: ఎంప్లాయీస్ సొంత డబ్బులకు పేచీ
దిశ, తెలంగాణ బ్యూరో: పొదుపు చేసుకున్న డబ్బులు, మెడికల్ రీయింబర్స్‌మెంట్, లీవ్ ఎన్‌క్యాష్ మెంట్ బిల్లుల చెల్లింపులో ఆలస్యం అవుతున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు డబ్బుల కోసం నెలల కొద్దీ ఎదురుచూస్తున్నారు. ఆర్థికశాఖ టోకెన్లు ఇస్తోందే తప్ప నిధులను రిలీజ్ చేయడం లేదని విమర్శలు ఉన్నాయి. అయితే తమ దగ్గరకు వచ్చిన ఫైల్స్‌ను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నామని, డిపార్ట్‌మెంట్ల హెడ్స్ వద్దే చాలాకాలంగా పెండింగ్‌లో ఉంటున్నట్టు ఆర్థికశాఖ వర్గాలు వెల్లడించాయి.
ఏడాదిగా నిరీక్షణ
ప్రభుత్వ ఎంప్లాయిస్ ప్రతినెలా పీఎఫ్, ఇన్సూరెన్స్ కోసం తమ శాలరీల్లో కొంత మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లింస్తుంటారు. ఆ డబ్బులను ఆయా ఎజెన్సీలకు ట్రెజరీలు ప్రతినెలా జమ చేస్తుంటాయి. అయితే పిల్లల పెండ్లి, ఉన్నత చదువులు, ఇతర అవసరాల కోసం ఆ డబ్బును రిలీజ్ చేసుకునే వెసులుబాటు ఉంది. దరఖాస్తు చేసుకున్న తర్వాత ఇన్సురెన్స్, పీఎఫ్ సంస్థల నుంచి డబ్బులు ప్రభుత్వం అకౌంట్లలో పడుతున్నాయి. కానీ వాటిని ప్రభుత్వం ఇవ్వడానికి మాత్రం నెలల కొద్దీ ఆలస్యం చేస్తున్నట్టు పెద్దఎత్తున ఫిర్యాదులు ఉన్నాయి. గతేడాది క్లయిమ్ చేసుకున్న ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ఇప్పటి వరకు కొందరు ఎంప్లాయీస్‌కు అందలేదని తెలుస్తున్నది. అలాగే మెడికల్ రీయింబర్స్‌మెంట్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌కు సంబంధించిన బిల్లులు కూడా పెండింగ్‌లో పెడుతున్నట్టు సమాచారం. కేవలం టోకెన్లు ఇస్తున్నారే తప్ప వాటిని రిలీజ్ చేయడంలేదని ఉద్యోగ సంఘాల లీడర్లు ఆరోపిస్తున్నారు.
హెచ్ఓడీల్లోనే నిర్లక్ష్యం
ఎంప్లాయీస్‌కు సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో ఎలాంటి ఆలస్యం చేయడం లేదని ఆర్థికశాఖ వర్గాలు చెబుతున్నాయి. డిపార్ట్‌మెంట్స్ వద్ద స్క్రూటినింగ్ త్వరగా పూర్తి చేయకపోవడం వల్లే ఆలస్యం అవుతోందని అభిప్రాయపడ్డారు. అక్కడ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత తమకు వచ్చిన వెంటనే టోకన్లు జారీచేస్తున్నట్టు తెలిపారు. అయితే తాము జారీచేసిన టోకెన్లకు వరుస ప్రకారం డబ్బులు రిలీజ్ చేస్తున్నామని వివరించారు.