ఆటో రాముడు.. డ్రామాలు మానడు..! టీ కాంగ్రెస్ ఆసక్తికర ట్వీట్

by Ramesh N |
ఆటో రాముడు.. డ్రామాలు మానడు..! టీ కాంగ్రెస్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆటో రాముడు.. డ్రామాలు మానడు.. అని తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా వేదికగా విమర్శించింది. ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడపడం కేసీఆర్ కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య అని అని పేర్కొంది. మహిళా సాధికారత కోసం, పెరిగిన ధరల నుంచి ఉపశమనం కలిగించడం కోసం, నష్టాల్లో ఉన్న ఆర్టీసీని కాపాడడం కోసం కాంగ్రెస్ పార్టీ మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిందని తెలిపింది. కాంగ్రెస్ పార్టీ ఆటో డ్రైవర్ల సమస్యలను ముందుగానే గుర్తించి సంవత్సరానికి 12 వేల రూపాయలను అందిస్తామని, ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు గుర్తుచేసింది. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపింది.

అభినందించి, సరైన సూచనలు అందించాల్సిన ప్రతిపక్షం, మహిళలను కించపరిచేలా ప్రచారం చేస్తూ, ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి ఉపాధినిచ్చే ఆటోలను కాల్చేయమని ప్రోత్సహిస్తూ.. వారి చావుకు కారణం అవుతుందని ఆరోపించింది. పదేళ్లు ప్రజలకు దూరంగా ఉంటూ సకల భోగాలు అనుభవించిన డ్రామా రావు ఆటో రాముడిగా మారి సరికొత్త డ్రామా మొదలు పెట్టాడని విమర్శించింది. మీ డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారు కేటీఆర్.. అందుకే ఎన్నికల్లో మీకు తగిన బుద్ధి చెప్పారు.. ఇప్పటికైన ప్రతిపక్ష హోదాలో ఉన్న మీరు హుందాగా వ్యవహరించి, ప్రభుత్వానికి సరైన సూచనలు చేయండని కేటీఆర్ ఆటోలో ఉన్న ఫోటోను టీ కాంగ్రెస్ ట్వీట్ చేసింది.

Advertisement

Next Story