బిగ్ బ్రేకింగ్: తెలంగాణ టెన్త్ రిజల్ట్స్ విడుదల

by Satheesh |   ( Updated:2023-05-10 07:15:11.0  )
బిగ్ బ్రేకింగ్: తెలంగాణ టెన్త్ రిజల్ట్స్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ టెన్త్ రిజల్ట్స్ విడుదల అయ్యాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను ప్రభుత్వ అధికారిక సైట్ http://results.bse.telangana.gov.in లేదా http://results.bsetelangana.org వెబ్ సైట్ల ద్వారా తెలుసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు. ఫలితాల్లో ఏదైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకు రావాలని సూచించారు. ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో 86.60 శాతం ఉత్తీర్ణత నమోదు అయినట్లు అధికారులు ప్రకటించారు. బాలురు 84.68 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలికలు 88.53 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు.

పదో తరగతి ఫలితాల్లో బాలికలే పై చేయి సాధించారు. ఇక, 2793 స్కూళ్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదు అయినట్లు వెల్లడించారు. నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 99 శాతం పాస్ పర్సంటేజ్ నమోదు కాగా.. వికారాబాద్ జిల్లాలో అత్యల్పంగా 59.46 శాతం ఉత్తీర్ణత శాతం నమోద అయినట్లు తెలిపారు. ఇక, తెలంగాణలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు జరగగా.. 4.94 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.

Read More: టెన్త్ రిజల్ట్స్ విడుదల.. ఆ 25 స్కూళ్లలో ఒక్కరూ పాస్ కాలే!

Advertisement

Next Story