- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
T BJP: కాంగ్రెస్, బీఆర్ఎస్ "ప్రెండ్స్ విత్ బెన్‌ఫిట్స్".. బీజేపీ సంచలన ట్వీట్
దిశ, వెబ్ డెస్క్:కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS) లు ఫ్రెండ్స్ విత్ బెన్‌ఫిట్స్(Friends with Benfits) అన్నట్లుగా సపోర్ట్(Support) చేసుకుంటున్నాయని తెలంగాణ బీజేపీ(Telangana BJP) ట్వీట్ చేసింది. కేసీఆర్(KCRBRS) గొర్రెల స్కామ్(Sheep Scam) పై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ట్రిప్పుకు 126 గొర్రెలను గుటుక్కుమన్న గొప్పోల్లు అని విమర్శలు చేసింది. దీనిపై లాలూ యాదవ్(Lalu Yadav)కు చెందిన అప్రసిద్ధ దాణా స్కామ్(Dhana Scam)ను మరిచేలా చేయగలిగింది ఎవరైనా ఉన్నారంటే, అది కల్వకుంట్ల గొర్రెల కుంభకోణమేనని ఆరోపించింది.
ఈ లాజిస్టికల్ అద్భుతాన్ని వెలికితీసినందుకు కాగ్‌కి ధన్యవాదాలు అని ప్రత్యేకంగా రాసుకొచ్చింది. ఇక లాజిక్ మరియు ఫిజిక్స్ రెండింటినీ ధిక్కరించి, సింగిల్-ట్రిప్ ఇన్‌వాయిస్‌లు సృష్టించవచ్చనే నమ్మశక్యం కాని రవాణా సామర్థ్యాలను బహిర్గతం చేయగలరని ఎవరు ఊహింస్తారని చెప్పింది. ఈ స్కాంలో అంబులెన్స్ 84 గొర్రెలను, ద్విచక్ర వాహనం 126 గొర్రెలను ధైర్యంగా లాగుతున్నదని, అలాగే క్యాబ్ 168 గొర్రెలకు వసతి కల్పిస్తున్నదని, అంతేగాక ఆటో 126 గొర్రెలను ఎక్కించుకుని వెళ్తున్నదని బయటపడిందని ఎద్దేవా చేసింది. ఇంతలో “ఫ్రెండ్స్ విత్ బెన్‌ఫిట్స్” లా కాంగ్రెస్ ప్రభుత్వం రక్షణ కవచం ఏర్పాటు చేసి, బయటపడేందుకు మార్గం చూపుతోందని బీజేపీ సంచలన వ్యాఖ్యలు చేసింది.