- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sunil Bansal: తెలంగాణ సభ్యత్వాల నమోదుపై సునీల్ బన్సల్ కీలక దిశానిర్దేశం
దిశ, డైనమిక్ బ్యూరో: సభ్యత్వ నమోదులో అన్ని వర్గాలను భాగస్వామ్యం చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ లోని పార్టీ స్టేట్ ఆఫీస్ లో పార్టీ సభ్యత్వ నమోదుపై జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ యువ, మహిళా, కిసాన్ మోర్చాలకు మెంబర్ షిప్ డ్రైవ్ పై కీలక దిశానిర్దేశం చేసిన ఆయన.. ప్రతి ఇంటికి వెళ్లి సభ్యత్వ నమోదు చేయాలని సూచించారు. కాగా సభ్యత్వ నమోదు ప్రక్రియను అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల సభ్యత్వాలు లక్ష్యంగా పని చేస్తున్నది. ఎల్లుండి నుంచి జరగబోయే మెంబర్ షిప్ డ్రైవ్ కోసం క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇప్పటికే పార్టీలోని ఆయా విభాగాలకు అధిష్టానం వర్క్ షాప్ ల ద్వారా ఇన్ పుట్స్ అందజేసింది. నిజానికి ఈ నెల 2 నుంచే సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉండగా భారీ వర్షాలు, వరదల కారణంగా ఈ నెల 8కి పోస్ట్ పోన్ చేశారు.