- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని సూసైడ్.. ఆరు పేజీల సూసైడ్ నోట్
దిశ, వెబ్ డెస్క్: బాసర ఐఐటీ(Basra IIT)లో ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని స్వాతి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. యువతి ఆత్మహత్య( suicide)కు ముందు ఆరు పేజీల సూసైడ్ నోట్( 6 pages suicide note) రాసింది.. అందులో అమ్మ, నాన్న క్షమించండి.. మిమ్మల్ని వదిలి వెళ్తున్నందుకు బాధగా ఉంది. సూసైడ్ చేసుకోవాలంటే భయంగా ఉందని స్వాతి లేఖలో రాసుకొచ్చింది. సీనియర్ విద్యార్థిని భాయ్‌ఫ్రెండ్ ఫోన్ చేసి తనను వేధిస్తున్నాడని, తనను బూతులు తిడుతున్నాడని, నవంబర్ 4న స్వాతి(swathi) ఐఐటీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. కాగా స్వాతి ఫిర్యాదును ట్రిపుల్ ఐటీ అధికారులు పట్టించుకోకపోవడం లేదని తన లేఖలో స్వాతి తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. కాగా ఈ లేఖపై పోలీసులు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
ఇదిలా ఉంటే బాసర ఐఐటీ విద్యార్థిని ఆత్మహత్య.. రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. తమ కుమార్తె ర్యాగింగ్ వల్లే చనిపోయిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కుమార్తె సూసైడ్ నోట్ బయటపెట్టాలని కోరుతున్నారు. ఇదే విషయంపై స్వాతి ఆత్మహత్యకు కారణం చెప్పాలంటూ.. ఏబీవీపీ(ABVP) విద్యార్థులు ధర్నా నిర్వహించగా.. ట్రిపుల్ ఐటీ సెక్యూరిటీ గార్డ్ దాడిలో గాయపడ్డ ఏబీవీపీ కార్యకర్తలు సాయి కుమార్ ప్రస్తుతం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా అతని పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై స్థానిక బీజేపీ ఎమ్మెల్యే(BJP MLA) స్పందించారు. విద్యార్థిని ఆత్మహత్యకు కారణమైన వారిని, ఎబీవీపీ విద్యార్థిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, లేదంటే బాసర క్యాంపస్ ముట్టడిస్తామని వార్నింగ్ ఇచ్చారు.