N.Kishore Reddy: సీఎం రేవంత్ తో ఎస్ఆర్ టీఆర్ ఐ చైర్మన్ భేటీ

by Prasad Jukanti |   ( Updated:2025-01-11 11:43:22.0  )
N.Kishore Reddy: సీఎం రేవంత్ తో ఎస్ఆర్ టీఆర్ ఐ చైర్మన్ భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్ పూర్ లోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ చైర్మన్ డా.ఎన్.కిశోర్ రెడ్డి (Dr.N. Kishore Reddy) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో భేటీ అయ్యారు. తనను ఇటీవల ఎస్ఆర్ టీఆర్ఐ (SRTRI)సంస్థ చైర్మన్ గా ప్రభుత్వం నియమించిన నేపథ్యంలో కిశోర్ రెడ్డి శనివారం సీఎంను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి పూల బోకేను ఇచ్చి శాలువాతో సత్కరించారు. సంస్థ అధివృద్ధికి సహకరించాలని సీఎంను కోరారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. కాగా స్వామి రామానంద తీర్థ సంస్థను రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీగా (Skill University) మార్చాలని భావిస్తోంది. దీనిపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖను ఆదేశించింది.

Next Story

Most Viewed