హుక్కాపై ఉక్కుపాదం.. గచ్చిబౌలిలో ఆరుగురిపై కేసు నమోదు

by GSrikanth |   ( Updated:2024-03-23 05:04:33.0  )
హుక్కాపై ఉక్కుపాదం.. గచ్చిబౌలిలో ఆరుగురిపై కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: నగరంలోని హుక్కా సెంటర్లపై మరోసారి ఎస్వోటీ పోలీసులు పంజా విసిరారు. శుక్రవారం రాత్రి గచ్చిబౌలిలోని స్కై కేఫ్ హుక్కా సెంటర్‌లో విస్తృతంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్నారంటూ హుక్కా సెంటర్ యజమాని అబ్దుల్ ఫరీద్‌తో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అబ్దుల్ ఫరీద్ పరారీలో ఉన్నారు. దాడుల అనంతరం తొమ్మిది హుక్కా పాట్స్, ఆరు హుక్కా ఫ్లేవర్స్, 18 పైపులు, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా, రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం హుక్కా సెంటర్లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టగా.. దానికి ఆమోదం కూడా వచ్చింది. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్‌గా మార్చాలని కంకణం కట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పటికే పోలీస్ శాఖకు కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలు రాష్ట్రంలో కనపడకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్డర్స్ జారీ చేశారు. హైదరాబాద్ నగరంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న హుక్కా సెంటర్లపై ఉక్కుపాదం మోపాలని ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Next Story

Most Viewed