- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ సూత్రధారుల్లో ప్రభుత్వ ఉద్యోగులే ఎక్కువ
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగం.. కడుపులో చల్ల కదలని జీవితం.. అయినా దురాశకు పోయిన వాళ్లు కటకటాల వెనక్కి వెళ్లారు. ఇటు ఉద్యోగాలు అటు పరువు పోగొట్టుకున్నారు. టీఎస్పీఎస్సీ కేసులో ఇప్పటివరకు పట్టుబడ్డ వారిలో పన్నెండు మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులే ఉన్నారు. సిట్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. మరికొంత మంది ప్రభుత్వ ఉద్యోగులు అనుమానితుల జాబితాలో ఉన్నారని చెప్పటం గమనార్హం.
ప్రవీణ్ నుంచి మొదలు...
టీఎస్పీఎస్సీ బోర్డులో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గా ఉన్న ప్రవీణ్ కుమార్ కు గ్రూప్1 ఆఫీసర్ కావాలన్నది కల. ఈ క్రమంలో కాంట్రాక్టు పద్ధతిపై బోర్డులో నెట్వర్క్ ఇంచార్జ్ గా పనిచేస్తున్న రాజశేఖర్ రెడ్డితో కలిసి కాన్ఫిడెన్షియల్ రూంలోని కంప్యూటర్ నుంచి గ్రూప్1 పరీక్ష ప్రశ్నా పత్రాన్ని కొట్టేశాడు. పనిలో పనిగా ఏఈఈ సివిల్, జనరల్ నాలెడ్జ్, డీఏఓ పరీక్షల పేపర్లు కూడా తస్కరించాడు. ఆ తర్వాత వీటిని అంగట్లో సరుకుల్లా అమ్ముకున్నాడు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే ఈ ప్రశ్నా పత్రాలు వేర్వేరు వ్యక్తులకు చేరటంలో ప్రభుత్వ ఉద్యోగులే కీలక పాత్ర వహించటం. ఈ జాబితాలో రేణుక ఆమె భర్త లద్యావత్ డాక్యా నాయక్, కేతావత్ శ్రీనివాస్, షమీమ్, ప్రశాంత్, రవికిశోర్, రమేష్, భరత్ నాయక్ తదితరులు ఉన్నారు.
మరికొందరు...
సిట్ కు చెందిన ఓ అధికారితో మాట్లాడగా మరికొందరు ప్రభుత్వ ఉద్యోగులు తమ రాడార్ లో ఉన్నట్టు చెప్పారు. ముఖ్యంగా విద్యుత్ శాఖలో పని చేస్తున్న ఇంకొందరికి టీఎస్పీఎస్సి కేసుతో సంబంధం ఉన్నట్టు ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితులను జరిపిన విచారణలో వెళ్లడయ్యిందని తెలిపారు. ప్రస్తుతం వీరి కోసం గాలింపు కొనసాగుతోందని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ తేలికగా డబ్బు సంపాదించాలన్న దురాశతో ప్రశ్నా పత్రాలను కొని ఆ తర్వాత వాటిని అమ్మినట్టు తెలిపారు. కొందరు అయినవాళ్ల కోసం పేపర్లు కొని జైలు పాలైనట్టు చెప్పారు. ఇదిలా ఉండగా లీకేజీ కేసులో సిట్ అధికారులు తాజాగా మరొకరిని అరెస్ట్ చేసారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్ కుమార్ స్నేహితుడు, ఎంఎన్సీ కంపెనీ ఉద్యోగి నర్సింగ్ రావును ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ప్రవీణ్ కుమార్ నుంచి ఏఈఈ పరీక్ష ప్రశ్నా పత్రాలు తీసుకున్న నర్సింగ్ రావు వాటిని మరికొందరికి అమ్మినట్టు విచారణలో తేలింది.