- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాణి కుముదిని దళితురాలు కాబట్టే శాంతికుమారికి సీఎస్ పోస్టు : RS Praveen Kumar
దిశ, డైనమిక్ బ్యూరో: దళితుల పట్ల సీఎం కేసీఆర్ వివక్ష చూపుతున్నారని బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. శుక్రవారం హనుమకొండ జిల్లా ఐనవోలు మల్లన్న జాతర నేపథ్యంలో స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బహుజనులు ఎక్కువగా ఆరాధించే గ్రామదేవతల ఆలయాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వాటిని అభివృద్ధి చేయడం లేదన్నారు. చీఫ్ సెక్రటరీ విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం దళితుల పట్ల వివక్ష చూపిందని ఆరోపించారు. సీఎస్‌గా శాంతి కుమారిని నియమించినందుకు సంతోషమే కానీ ఆమె కన్నా సీనియర్ ఆఫీసర్ రాణి కుముదిని ఐఏఎస్ ఉన్నప్పటికీ ఆమెను సీఎస్‌గా ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు. ఇది దళితుల పట్ల సీఎం కేసీఆర్‌కు ఉన్న వివక్ష అని మండిపడ్డారు. రాణి కుముదిని సీఎస్‌గా నియమించకపోవడానికి గల కారణాలు ఏంటని ప్రశ్నించారు. దళితురాలు కాబట్టే రాణి కుముదిని కాదని శాంతికుమారికి సీఎస్ పదవిని కట్టబెట్టారని ఆరోపించారు.
- Tags
- rs praveen kumar