కొండగట్టులో సిగ్నల్ ప్రాబ్లం.. జర్నలిస్టుల తిప్పలు

by Sathputhe Rajesh |   ( Updated:2023-02-24 06:02:43.0  )
కొండగట్టులో సిగ్నల్ ప్రాబ్లం.. జర్నలిస్టుల తిప్పలు
X

దిశ, మల్యాల: కొండగట్టు ఆలయంలో చోరీకి గల కారణాలను మరియు వివరాలను డెస్క్‌కు చేరవేసే క్రమంలో జర్నలిస్టులకు తిప్పలు తప్పట్లేదు. కొండగట్టు గుట్టపై బిఎస్ఎన్ఎల్ తప్ప మరే ఇతర టెలికం సంస్థల సిగ్నల్స్ అందకపోవడంతో ఒక్కొక్కరు ఒక్కొక్క గుట్ట వైపు చెట్టు వైపు వెళ్తూ సిగ్నల్ వేటలో నిమగ్నమై వార్త చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది అయితే సిగ్నల్ అందక తలలు పట్టుకుంటున్నారు. కాగా కొండగట్టులో ఈ ఉదయం చోరీ ఘటన వెలుగు చూసిన సంగతి తెలిసిందే.

Read More... కొండగట్టు : లోపల ఎంక్వైరీ.. బయట ఆందోళన

Advertisement

Next Story