షర్మిల దీక్ష విరమణ.. నేడో, రేపో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి

by Nagaya |   ( Updated:2022-12-11 16:41:27.0  )
షర్మిల దీక్ష విరమణ.. నేడో, రేపో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి
X

దిశ, తెలంగాణ బ్యూరో : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. రెండ్రోజులు దీక్షచేస్తున్న షర్మిల ఆరోగ్య పరిస్థితి విషమిస్తుండటంతో పోలీసులు ఆమెను బలవంతంగా లోటస్ పాండ్ దీక్షాస్థలి నుంచి ఆస్పత్రికి తరలించారు. చికిత్సకు సహకరించకపోవడంతో బలవంతంగా ఆమెకు ఫ్లూయిడ్స్ ఎక్కించినట్లు శ్రేణులు వెల్లడించాయి. ఆస్పత్రిలో ఉన్నా షర్మిల తన దీక్షను కొనసాగిస్తుందని పార్టీ నేతలు చెప్పారు. కానీ బీపీ డౌన్ అవ్వడం, నీళ్లు కూడా తాగకపోవడంతో డీ హైడ్రేషన్ వల్ల ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆమె దీక్ష విరమించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆమె జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రి నుంచి నేడో, రేపో ఆమె డిశ్చార్జి కానున్నట్లు పార్టీ శ్రేణులు వెల్లడించాయి. వైద్యులు కనీసం 2 నుంచి 3 వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కాగా 3 వారాల తర్వాతే భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశాలున్నాయి.

Advertisement

Next Story