- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహబూబ్‌నగర్ ఎంపీ టికెట్ నాదే.. బీజేపీ కీలక నేత ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఆశావహులంతా టికెట్ల ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామనే సంకేతాలను ఆయా పార్టీల అధిష్టానాలకు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. బీఆర్ఎస్ అధిష్టానం వ్యక్తిగతంగా అభ్యర్థులను ఫోన్ చేసి గ్రౌండ్ సిద్ధం చేసుకోవాలని సూచనలు చేస్తోంది. మరోవైపు బీజేపీ కూడా లోక్‌సభ ఎన్నికలను సీరియస్‌గా తీసుకున్నది. 12 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా కార్యచరణ రూపొందించింది.
ఈ క్రమంలోనే బీజేపీ అగ్రనేతలను మరోసారి రాష్ట్రానికి రప్పించి ప్రచారం చేయించాలని చూస్తోంది. ఈ క్రమంలో పార్టీ కీలక నేత, మహబూబ్‌నగర్ టికెట్ ఆశిస్తున్న జితేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మహబూబ్‌నగర్ టికెట్ నాదే అని సంచలన ప్రకటన చేశారు. తనకు ఢిల్లీ పెద్దల ఆశీర్వాదం ఉన్నదని చెప్పారు. టికెట్ కోసం ఎవరైనా తమ ప్రయత్నాలు చేయొచ్చని సూచించారు. ఒకవేళ తనకు కాకుండా మహబూబ్‌నగర్ టికెట్‌ను డీకే అరుణకు కేటాయిస్తే ఆమెకు మద్దతిచ్చే విషయంపై తర్వాత ఆలోచిస్తానని షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ మెజార్టీ సీట్లు గెలవబోతోందని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉండనుందని తెలిపారు.