బ్రేకింగ్: పార్టీ మార్పుపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2023-04-29 06:37:59.0  )
బ్రేకింగ్: పార్టీ మార్పుపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ బహిష్కృత నేత, గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ మార్పుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీని వీడి రాజాసింగ్ టీడీపీలో చేరుతున్నారంటూ ఇటీవల జోరుగా ప్రచారం జరగడంతో వాటిపై శనివారం ఎమ్మెల్యే క్లారిటీ ఇచ్చారు. తాను టీడీపీలో చేరుతున్నానంటూ వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని రాజాసింగ్ కొట్టిపారేశారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని వీడే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. ఇక, రాజాసింగ్ ఓ వర్గంపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో ఆ కామెంట్స్ సంచలనంగా మారాయి. దీంతో పోలీసులు ఆయనపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపారు. దీంతో బీజేపీ రాజాసింగ్‌ను పార్టీ నుండి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

అయితే, పార్టీ నుండి సస్పెండ్ చేసి నెలలు గడుస్తున్నా.. తన విషయంలో బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మనస్థాపం చెందిన రాజాసింగ్ టీడీపీలో చేరబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. టీడీపీలో చేరేందుకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌తో రాజాసింగ్ చర్చలు సైతం జరిపాడని వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో రాజాసింగ్ పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు.

Also Read..

ఈ సారి పోటీ చేయను.. జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story