- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
కీచక టీచర్....! పదో తరగతి విద్యార్థిని పై వేధింపులు

దిశ, యాదాద్రి కలెక్టరేట్ : పదో తరగతి విద్యార్థిని టీచర్ వేధించిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని బ్రిలియంట్ స్కూల్‌లో సైన్స్ ఉపాధ్యాయుడు సంజయ్ కుమార్ 10 వ తరగతి విద్యార్థినికి ఫోన్ లో అసభ్య మెసేజ్‌లు పంపుతూ వేధించాడు. గత కొన్ని నెలలుగా వేధింపులు ఎక్కువ కావటం తో వేధింపులు తాళలేక విద్యార్థిని ఇంట్లో చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు బుధవారం పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. స్కూల్ యాజమాన్యం పై విద్యార్థిని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో టీచర్ సంజయ్ కుమార్‌ను అరెస్ట్ చేసి స్టేషన్‌కి తరలించారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు. పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా బాలికపై వేధింపులకు పాల్పడిన టీచర్ పై చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.