ఆ విషయంలో హీరోలతో సమానంగా హీరోయిన్లకు ఉండదు.. మలయాళీ బ్యూటీ షాకింగ్ కామెంట్స్

by Kavitha |
ఆ విషయంలో హీరోలతో సమానంగా హీరోయిన్లకు ఉండదు.. మలయాళీ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: మలయాళి ముద్దుగుమ్మ నిఖిలా విమల్(Nikhila Vimal) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘భాగ్య దేవత’(Bhagyadevatha) సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. దిలీప్ నటించిన ‘లవ్ 24*7’ అనే మూవీతో హీరోయిన్‌గా ప్రేక్షకులకు పరిచయం అయింది. తన ఫస్ట్ చిత్రంతోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్నది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ఆ తర్వాత నటించిన దాదాపు అన్ని చిత్రాలతో మంచి ఫేమ్ తెచ్చుకుంది. కేవలం మలయాళ భాషా సినిమాల్లోనే కాకుండా తమిళంలోనూ నటిస్తుంది. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఈ బ్యూటీ.

అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లోనూ యాక్టీవ్‌గా ఉంటూ తన అంద చందాలతో మత్తెక్కిస్తుంది ఈ భామ. తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విమల్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ..“మహిళల వైపు నుంచి చెప్పాలంటే, మాకు అంత జీతం రాదు. కాబట్టి జీతాలను ఇంకా తగ్గిస్తామని చెబితే, మనకు ఏమీ ఉండదు. ఇది మన వైపు నుండి కాదు అని చెప్పాలి. ఈ విషయం గురించి అసోసియేషన్ చర్చించుకున్న తర్వాత తుది నిర్ణయం తీసుకున్నప్పుడు నేను దాని గురించి మాట్లాడటానికి ఆసక్తి చూపుతాను.

అంతే కాకుండా, చర్చ సమయంలో నాకు తెలియని అంశం గురించి మాట్లాడకూడదనేది నా వైఖరి. వాళ్ళలో నిజంగా ఏం సమస్యలు తలెత్తుతున్నాయో లేదా వాళ్ళు ఎందుకు ఇలా అంటున్నారో నాకు అంతగా అర్థం కావడం లేదు. కాబట్టి దాని గురించి మాట్లాడటం కంటే తుది నిర్ణయం తెలుసుకుని, దాని గురించి మాట్లాడటం మంచిదని నేను భావిస్తున్నాను” అని నిఖిల చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ భామ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.



Next Story

Most Viewed