- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘ఈ-ప్రొక్యూర్‌మెంట్’కు ‘స్కోచ్’ అవార్డు
దిశ, తెలంగాణ బ్యూరో : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పౌర సేవల్లో ఉత్తమ ఫలితాలను సాధించినందుకు ప్రతీ సంవత్సరం ప్రభుత్వ విభాగాలను ఎంపిక చేసి అవార్డులతో సత్కరిస్తున్న ‘స్కోచ్’ సంస్థ ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ‘ఈ-ప్రొక్యూర్‌మెంట్’ విభాగానికి ఎంపికైంది. ‘ఈ-గవర్నెన్స్’ కేటగిరీ కింద ‘స్కోచ్ గోల్డ్’ అవార్డుకు ఎంపిక చేసినట్లు సంస్థ పేర్కొన్నది. ఢిల్లీలోని ఇండియన్ హేబిటాట్ భవనంలో శనివారం జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో ‘ఈ-ప్రొక్యూర్‌మెంట్’ తరఫున జాయింట్ డైరెక్టర్ (ఈ-గవర్నెన్స్) పెండ్యాల శ్రీనివాస్ గోల్డ్ అవార్డును అందుకున్నారు.
రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమ్యూనికేషన్ల శాఖలో ఈ-ప్రొక్యూర్‌మెంట్ సేవలను అందిస్తున్న సర్వీస్ ప్రొవైడర్ ‘ఉపాధి టెక్నో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్’ కూడా అవార్డుకు ఎంపికైంది. ఈ ప్రైవేటు కంపెనీ తరఫున మేనేజింగ్ డైరెక్టర్ కల్యాణ్ చక్రధర్ రెడ్డి స్కోచ్ గ్రూపు చైర్మన్ సమీర్ కొచ్చర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.