- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
యువకుడి సూసైడ్ వీడియో.. ఘాటుగా రిప్లై ఇచ్చిన సజ్జనార్

దిశ, వెబ్‌డెస్క్; సోషల్ మీడియాలో (Social media) ఫేమస్ అవ్వాలనే పిచ్చి పట్టుకున్న వారంతా సామాజిక విద్రోహులుగా పరిగణించాలని విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్(VC. Sajjanar) మండిపడ్డారు. ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో రాత్రికి రాత్రే ఫేమస్ (Popular) అవ్వడం కోసం ఓ మహానుభావుడు చేసిన పని గురించి తన ‘X’ (ట్విట్టర్) ఖాతాలో ఓ వీడియో విడుదల చేశారు. అయితే, ఆ వీడియోకు 4.4 మిలియన్ల వ్యూస్ (views) వచ్చాయని.. అదేదో ఘనకార్యం చేసినట్లుగా మరొక వీడియోను వదిలాడని మండిపడ్డారు. ఈ మధ్య సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్, కామెంట్ల కోసం యువత ఎంత దూరమైన వెళ్తున్నారని ఆరోపించారు. ప్రజలు ఇలాంటి సామాజిక ద్రోహులకు దూరంగా ఉండాలని సుచించారు. సోషల్ మీడియా అనేది కేవలం సామాజిక అంశాలు, కొంత మానసిక ఉల్లసానికి మాత్రమే సాధనాలని.. కానీ, అదే జీవితం కాదని అన్నారు. వ్యక్తిగత గుర్తింపు అనేది సోషల్ మీడియా వల్లే వస్తుందనే భ్రమలోంచి యువత బయటకి రావాలని కోరారు. జీవితంలో కష్టాన్ని నమ్ముకుంటే ఉన్నత స్థాయికి ఎదగవచ్చనే విషయాన్ని గ్రహించాలని సజ్జనార్ అన్నారు.