ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నం

by GSrikanth |
ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నం
X

దిశ, వెబ్‌డెస్క్: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బస్ డిపో మేనేజర్ ఆఫీసు ఎదుట ఆర్టీసీ కార్మికుడు దామోదర్ ఆత్మహత్యాయత్నం చేశాడు. అన్యాయంగా తనను విధుల నుంచి తొలగించారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశాడు. కాగా, కార్మికుడు దామోదర్ గత 20 ఏళ్లుగా ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్నట్లు సమాచారం. గమనించిన తోటి కార్మికులు అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. విషయం తెలిసిన పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యాయత్నానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story