'నల్గొండ MLA పాత్రపై పూర్తి స్థాయి విచారణ జరగాలి'

by GSrikanth |
నల్గొండ MLA పాత్రపై పూర్తి స్థాయి విచారణ జరగాలి
X

దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామ సర్పంచ్ గాదె సంధ్యారాణి భర్త విజయ్ రెడ్డిని గుర్తు తెలియని దుండగులు కత్తులతో కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ''తిప్పర్తి - ఎల్లమ్మగూడెం మాజీ సర్పంచ్ భర్త విజయ్ రెడ్డి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. తన భార్య సంధ్య స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే తనను వేధిస్తున్నాడని ఆరోపిస్తూ ఇటీవలే రాజీనామా కూడా చేసింది. ఇందులో నల్గొండ MLA పాత్రపై కూడా పూర్తి స్థాయి విచారణ జరగాలి. ఓటమి భయంతో టీఆర్ఎస్ ప్రజల ప్రాణాలు తీస్తున్నది.'' అంటూ ట్విట్టర్ వేదికగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.


Advertisement

Next Story

Most Viewed