తెలంగాణలో రూ.4 వేల పెన్షన్.. అర్హులకు BIG అలర్ట్

by GSrikanth |
తెలంగాణలో రూ.4 వేల పెన్షన్.. అర్హులకు BIG అలర్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘ప్రజాపాలన’ నిర్వహిస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన ఆరు గ్యారంటీల అమలే లక్ష్యంగా కార్యచరణ రూపొందించింది. ఈనెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రభుత్వం 6 గ్యారంటీలపై ప్రజాపాలన ద్వారా ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. అందులో చేయూత పథకం కింద రూ.4000 పెన్షన్, దివ్యాంగులకు రూ.6000 పెన్షన్ పొందాలంటే రేపటినుంచే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవాలి. ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న వారు, ప్రజా భవన్‌లో ఇప్పటికే అప్లై చేసిన వారు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి అవసరం లేదని సంబంధిత అధికారులు వెల్లడించారు. పెన్షన్ రాని అర్హులు మాత్రం తప్పనిసరి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed