- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Revanth: ఈ రోజు చరిత్రలో లిఖించబడుతుంది.. రాహుల్ గాంధీకి సీఎం ఆసక్తికర రిప్లై
దిశ, వెబ్ డెస్క్: కులగణన కార్యక్రమం(Caste Census Program) చేపట్టిన ఈ రోజు చరిత్రలో సువర్ణాక్షరాల(Golden Letters In History)తో లిఖించబడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) అన్నారు. తెలంగాణలో కులగణన కార్యక్రమం చేపట్టంపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ(AICC leader Rahul Gandhi) ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఈ పోస్టుపై స్పందించిన రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆయన.. తెలంగాణ నేడు కులాల సర్వే గణన ప్రారంభంతో విప్లవ యాత్ర(Revolutionary Journey)కు శ్రీకారం చుట్టిందని వ్యాఖ్యానించారు. తమ నాయకుడు రాహుల్ గాంధీ వాగ్దానం ప్రకారం తెలంగాణలో అన్ని బలహీన వర్గాలకు సామాజిక న్యాయం సాకారం కానుందని స్పష్టం చేశారు.
ఇక ఈ రోజు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని చెప్పారు. అంతేగాక సామాజిక న్యాయం కోసం తదుపరి తరం కార్యక్రమాలు, విధానాలలో భారతదేశంలో అగ్రస్థానంలో ఉండేలా తాము రాబోయే రోజుల్లో తీవ్రంగా కృషి చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. కాగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కులగణనపై స్పందిస్తూ.. తెలంగాణలో కుల గణన ప్రారంభమైందని, రాష్ట్రంలోని ప్రతి వర్గాల అభివృద్ధికి సంబంధించిన విధానాలను రూపొందించడానికి తాము దీని నుండి పొందిన డేటాను ఉపయోగిస్తామని అన్నారు. అంతేగాక త్వరలో మహారాష్ట్రలో కూడా ఇదే జరగనుందని, పార్లమెంట్(Parliament)లో కుల గణనను ఆమోదించి, రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం(50 Percent) అడ్డుగోడలను బద్దలు కొడతామని రాసుకొచ్చారు.