ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్ ఉరేసుకున్నా రుణమాఫీ ఆపను: Revanth Reddy

by Disha Web Desk 9 |
RevanthReddy1
X

దిశ, వెబ్‌డెస్క్: కేసీఆర్ ఫామ్‌హౌజ్ లోపల ఉరేసుకొని సచ్చినా సరే రుణమాఫీ ఆపబోను అని.. చేసి తీరుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నారాయణపేట జిల్లా మద్దూరులో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘అక్కడి సూర్యుడు ఇక్కడ పొడిచినా.. భూమి, ఆకాశం తలకిందులైనా, కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో ఉరేసుకుని సచ్చినా ఆగస్టు లోపల రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి రైతులకు మరోసారి హామీ ఇచ్చారు. పలు పార్టీలు మాయమాటలు చెప్పి మిమ్మి్ల్ని మచ్చిక చేసుకోవాలని చూస్తున్నారు. వంద మాటలు చెబుతారని అవన్నీ నమ్మొద్దని అన్నారు. రైతులు ఎవ్వరూ అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. బ్యాంకులు రైతులను ఇబ్బంది పెట్టొద్దని, రుణమాఫీ చేసే బాధ్యత నాదేనని బీఆర్ఎస్ ప్రభుత్వానికి జలక్ ఇస్తూ రైతుల్లో ధైర్యాన్ని నింపారు



Next Story