- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఎంపీ ప్రభాకర్‌పై దాడి ఘటనపై రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇదే!
by Anjali |

X
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన కత్తి దాడి ఘటనపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి ఘటనను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ హింసను ఎప్పుడూ నమ్ముకొదని, అహింసా మూల సిద్ధాంతంగా పని చేస్తున్న పార్టీ కాంగ్రెస్ అని ఓ ప్రకటన విడుదల చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తి ఎరైనా కేసు నమోదు చేసి విచారణ జరపాలన్నారు. ఈ విషయంలో వెంటనే పూర్తి స్థాయిలో పారదర్శకంగా విచారణ జరిపి నిజానిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కాగా ఈ ఘటన వెనుక రాజకీయ కోణం ఉందని మంత్రి హరీష్ రావు ఆరోపించిన సంగతి తెలిసిందే.
Next Story