- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Tirumala:31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు.. సర్వదర్శనానికి సమయం ఎంతంటే?

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు(Devotees) తరలి వస్తుంటారు. ఈ క్రమంలో శ్రీవారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి పోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ నేపథ్యంలో వేలాది మంది భక్తులు తిరుమల చేరుకుని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ క్రమంలో భక్తుల రద్దీ కొన్నిసార్లు అధికంగా, మరికొన్నిసార్లు సాధారణంగా ఉంటుంది. ఈ తరుణంలో నేడు(శనివారం) భక్తుల రద్దీ కొనసాగుతోంది.
ఈ క్రమంలో ఇవాళ తిరుమలలోని 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఈ క్రమంలో శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుందని టీటీడీ(TTD) అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. నిన్న(శుక్రవారం) 70,462 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 25,393 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం(Hundi Income) రూ. 3.01 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.