'కమ్యూనిస్టులు అమ్ముడుపోవడం దురదృష్ణకరం'

by GSrikanth |
కమ్యూనిస్టులు అమ్ముడుపోవడం దురదృష్ణకరం
X

దిశ, వెబ్‌డెస్క్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. బైపోల్‌ నేపథ్యంలో సీపీఐ పార్టీ టీఆర్ఎస్‌తో చేతులు కలపడంపై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కమ్యూనిస్టులు అమ్ముడుపోవడం దురదృష్ణకరమన్నారు. ఈ నిర్ణయంతో ఇన్నాళ్లు పేదల కోసం వాళ్లు చేసిన పోరాటాలు వృథా అయ్యాయని విమర్శించారు. ఉప ఎన్నిక కారణంగా ప్రతినిధులు అమ్ముడుపోయారని, వాళ్లు పార్టీ ద్రోహులు అని మండిపడ్డారు. ఎవరు పార్టీని వీడినా తాము పేదల పక్షానే ఉంటామని, పోడు సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేస్తామని ప్రకటించారు.

Advertisement
Next Story

Most Viewed