- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రేవంత్.. ఇదేనా నువ్వు చెప్పిన సో కాల్డ్ ప్రజా పాలనా.. హరీష్ రావు హాట్ కామెంట్స్

దిశ, వెబ్ డెస్క్: రేవంత్ రెడ్డి (Revanth Reddy).. ఇదేనా నువ్వు చెప్పిన సో కాల్డ్ (So Called) ప్రజా పాలనా (People Governance) అని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు (BRS Leader Harish Rao) అన్నారు. ఓ న్యూస్ కార్యాలయం (News Office) పై పోలీసులు (Police) జరిపిన దాడికి సంబంధించిన వీడియోలను ట్విట్టర్ (Twitter) లో పోస్ట్ (Post) చేసిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)పై ఫైర్ (Fire) అయ్యారు. ఈ సందర్భంగా ఆయన.. న్యూస్ కార్యాలయంపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. అలాగే మహిళా జర్నలిస్టు (Women Journalist) పై అనుచితంగా ప్రవర్తించిన ఘటన ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఉందని విమర్శించారు.
అంతేగాక మీడియా స్వేచ్ఛ (Press Freedom) ను అణగదొక్కేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షస పాలన కొనసాగిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. ఇక అధికార బలంతో పోలీసులను మీడియాపై ఉసిగొల్పడం గర్హనీయమైన చర్య అని, మహిళా జర్నలిస్టుపై అక్కసుతో పోలీసులు ఓవర్ యాక్షన్ (Over Action) చేయడం, సీసీ కెమెరా డేటా (CC Camera Data)ను స్వాధీనం చేసుకోవడం మీడియా స్వేచ్ఛను కాలరాయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రేవంత్ రెడ్డి నిరంకుశ, నియంతృత్వ పాలనలో జర్నలిస్టులకు (Journalists) దక్కుతున్న గౌరవం అని విమర్శించారు. 14 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే బెదిరింపులు, పోస్టులు పెడితే భౌతిక దాడులు! అంటూ.. ఇదేనా మీరు చెప్పిన సో కాల్డ్ ప్రజాపాలన? అని నిలదీశారు. ఇందిరమ్మ రాజ్యమని (Indiramma Rajyam) కాంగ్రెస్ ఎమర్జెన్సీ పాలన (Congress Emergency Government)ను గుర్తుచేస్తున్నారని హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.