భైంసాలో The Kerala Story (ది కేరళ స్టోరీ) సినిమా పై ఆంక్షలు సడలింపు.. మార్నింగ్, మ్యాట్నీ షో లకు పర్మిషన్

by Mahesh |   ( Updated:2023-05-16 05:08:55.0  )
భైంసాలో  The Kerala Story (ది కేరళ స్టోరీ) సినిమా పై ఆంక్షలు సడలింపు.. మార్నింగ్, మ్యాట్నీ షో లకు పర్మిషన్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ప్రకంపణలు సృష్టించి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు కొల్లగొడుతున్న ది కేరళ స్టోరి సినిమాకి తెలంగాణలోని భైంసాలో అడ్డంకులు ఎదురయ్యాయి. అల్లర్లు జరిగే ప్రాంతం కావడంతో సినిమాను ప్రదర్శించే థియేటర్లు పోలీసుల అనుమతి తీసుకోవాలని మొదటి రోజు సినిమా ప్రదర్శనను నిలిపి వేశారు. దీంతో థియేటర్ యాజమాన్యానికి పోలీసులకు మధ్య వాగ్వాదం నడిచింది. సెన్సార్ బోర్డ్ పర్మిషన్, రాష్ట్ర పర్మిషన్ ఉన్న కూడా పోలీసులు సినిమాను ఎందుకు నిలిపివేస్తున్నారని యాజమాన్యం పోలీసులతో వాదించారు. దీంతో కొంచెం వెనక్కి తగ్గిన పోలీసులు.. సినిమాపై కొన్ని ఆంక్షలు సడలించారు. ఈ సినిమాను కేవలం మార్నింగ్, మాట్నీ రెండు షోలకే మాత్రమే అనుమతిస్తూ పర్మిషన్ ఇచ్చారు. దీంతో ఈ రోజు ఉదయం 11 నుంచి సినిమా ప్రదర్శన ప్రారంభం కానుంది. అలాగే సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్న థియేటర్ల వద్ద పోలీసులు రక్షణ పెంచారు.

Advertisement

Next Story