- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రజా యుద్ధ నౌక గద్దర్ ప్రస్థానం ఇదే.. ఒంట్లో తూటాతోనే..
దిశ, వెబ్‌డెస్క్: ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఆకస్మిక మరణంతో యావత్ తెలంగాణ శోక సంద్రంలో మునిగిపోయింది. గత కొంత కాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతోన్న ఆయన.. చికిత్స పొందతూ ఇవాళ హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. గద్దర్ మరణవార్తను ఆయన కొడుకు సూర్యం దృవీకరించారు. ప్రజా గాయకుడు గద్దర్ మరణవార్తతో ఆయన అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాత్ర వర్ణాతీతం. ప్రత్యేక రాష్ట్రం ఉద్యమంలో తన పాటతో ఎంతో మందిని ఉత్తేజపరిచి.. ఉద్యమం ఉదృతం కావడానికి గద్దర్ ఊపిరిలూపోశారు.
గద్దర్ ప్రస్థానం..
తెలంగాణ ఉద్యమంలో క్రియా శీలక పాత్ర పోషించిన గద్దర్.. 1949 జూన్ 5న మెదక్ జిల్లా తూప్రాన్‌లో జన్మించారు. గద్దర్ ఆసలు గుమ్మడి విఠల్. మెదక్ జిల్లాలోని తుప్రాన్ జన్మించిన గద్దర్.. నిజాబామాద్, హైదరాబాద్ జిల్లాలో విద్యాభాస్యం కొనసాగించారు. హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో గద్దర్ క్రియా శీలక పాత్ర పోషించారు. తన మాటలనే పాటలుగా మలిచి ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఊపుతెచ్చారు.
ఉద్యమంలో తన పాటతో ఎంతోమందిని ఉత్తేజపరిచారు. 1971లో నర్సింగరావు ప్రోత్సాహంతో గద్దర్ ఆపరా రిక్షా పాట రాశారు. 1975లో గద్దర్ కెనరా బ్యాంక్‌లో ఉద్యోగం చేశారు. 1987లో కారంచేడులో జరిగిన దళితుల హత్యలపై గద్దర్ అవిశ్రాతంగా పోరాడారు. అంతేకాకుండా నకిలీ ఎన్ కౌంటర్లను సైతం గద్దర్ తీవ్రంగా వ్యతిరేకించారు. 1997 ఏప్రిల్ 6న గద్దర్‌పై హత్యయత్నం జరిగింది. దీంతో తర్వాత చాలా కాలం ఆయన ఒంట్లో తూటాతోనే జీవించారు.
2002లో నక్సల్ తరుఫున గద్దర్ ప్రభుత్వంతో చర్చల్లో పాల్గొన్నారు. ఇక, గద్దర్ తన పాటలతో ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. గద్దర్ పాడిన అమ్మా తెలంగాణమా, పొడుస్తున్న పొద్దుమీద వంటి పాటలు తెలంగాణ ఉద్యమానికి ఊపుతెచ్చాయి. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మ పాటకు నంది అవార్డ్ రాగా.. గద్దర్ నంది అవార్డ్‌ను తిరస్కరించారు. కాగా, గద్దర్‌కు భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. జన్యనాట మండలి వ్యవస్థాపలకుల్లో గద్దర్ సైతం ఒకరు.
Read More..
- Tags
- gaddar