- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వచ్చే ఎన్నికల్లో MP అర్వింద్‌పై పోటీకి సిద్ధం: సంజయ్

X
దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి డీఎస్ ఇంట్లో చేరికల చిచ్చు ఇంకా చల్లారడం లేదు. ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరిన డీఎస్.. 24 గంటల గడవకముందే రాజీనామా చేస్తున్నట్లు లేఖ విడుదల చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. డీఎస్ పార్టీలో చేరినా కొన్ని గంటల్లోనే రాజీనామా చేయడంపై ఆయన కొడుకు, మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తన తండ్రి డీఎస్ ఉంటున్న ఇంట్లో ఆయనకు రక్షణ లేదని ఆరోపించారు. అదే ఇంట్లో మా తమ్ముడు, ఎంపీ ధర్మపురి అర్వింద్ ఉంటున్నందుకు ఆందోళనగా ఉందని సంజయ్ అన్నారు. కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత అర్వింద్‌కు లేదని మండిపడ్డారు. అధిష్టానం ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో అర్వింద్‌పై పోటీకి సిద్ధమని కీలక వ్యాఖ్యలు చేశారు. తన తండ్రితో బలవంతంగా రాజీనామా చేయించారని ఆరోపించారు.
Next Story