- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
HailStroms : తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టిన వడగండ్ల వాన

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP), తెలంగాణ(Telangana) రాష్ట్రాల్లో అల్పపీడన ప్రభావం మొదలైంది. ఏపీలోని పలు జిల్లాల్లో భారీ ఈదురు గాలులు, పిడుగులు, వడగండ్లతో కూడిన వానలు(HailStroms) దంచికొట్టాయి. అల్లూరి జిల్లాలోని, మాడుగుల, మారేడుమిల్లి, ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం, కృష్ణా జిల్లాల్లోని విజయవాడ, కంచికర్ల, ఇబ్రహీంపట్నం, తూర్పు గోదావరిలోని గోకవరంలో వర్షాలు, ఈదురు గాలులు భీభత్సం సృష్టించాయి. మరోవైపు తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెంలోని అశ్వారావుపేట, ములుగు జిల్లాలోని మంగపేట, ఏటూరునాగారంలో వడగండ్ల వానలు కురిసాయి. అయితే మరికొన్ని గంటలుపాటు ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షం కురవనున్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం, విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరం అయితే తప్ప బయటికి రావొద్దని, విద్యుత్ స్థంబాలకు దూరంగా ఉండాలని, చెట్ల కింద నిలబడరాదని సూచించింది.