ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీ..

by Vinod kumar |
ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీ..
X

దిశ, పరిగి: ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్లు ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన పరిగిలో జరిగింది. పరిగి ఎస్ఐ పి. విటల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా నవాబుపేట్ మండలం ఎక్ మామిడి గ్రామానికి చెందిన వడ్ల బ్రహ్మచారి (42), వడ్ల చిట్టి, వడ్ల రాధిక పరిగి నుంచి కొడంగల్ వైపునకు మోటార్ సైకిల్ పై సోమవారం వెళ్తున్నారు. పరిగి మండలం మల్లెమాలగూడ గ్రామానికి చెందిన మేడ మోని సుధాకర్, కుందేలు శ్రీనివాస్, మహమ్మద్ నయీమ్ మోటార్ బైక్ కోడంగల్ వైపు నుంచి పరిగికి వస్తున్నారు.

ఈ రెండు బైకులు ఎదురెదురుగా హైవే 163 పై వస్తూ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వడ్ల బ్రహ్మచారి తీవ్ర గాయాలయి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వడ్ల చిట్టి రాధిక లకు తీవ్ర గాయాలయ్యాయి. మరో బైక్ పై ఉన్న ముగ్గురికి కూడా గాయాలయ్యాయి. వీరిని మెరుగైన వైద్య పరీక్షల కోసం నగరంలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుగుతున్నట్లు ఎస్ఐ పి.విటల్ రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story