- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రజల సంక్షేమం కోసం తపించే నాయకుడు టీఆర్ఆర్ : టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి
దిశ, పరిగి : ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే నాయకుడు మీ రామ్మోహన్ రెడ్డి అని టీపీసీసీ అధ్యక్షులు ఎ.రేవెంత్ రెడ్డి అన్నారు. పరిగిలోని టి.రామ్మోహన్ రెడ్డి నివాసంలో శుక్రవారం టీఆర్ఆర్ కొడుకు డాక్టర్ తమ్మన్న రితిక్ రెడ్డి జన్మదిన వేడుకలకు రేవెంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రితిక్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్బంగా వేలాదిగా కార్యకర్తల మద్య కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు రేవెంత్ రెడ్డి మాట్లాడుతూ తన కొడుకు జన్మదిన వేడుకలను కూడా సేవా మార్గంలోనే నిర్వహించడం అభినందనీయమన్నారు. కొన్నేళ్లుగా టీఆర్ఆర్ మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో ఉచితంగా పేదలకు వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. సేవే పరమావధిగా పనిచేస్తున్న టీఆర్ఆర్ ప్రజలు ఎమ్మెల్యేగా ఆశీర్వదించకపోవడం దురదృష్టకరమన్నారు. గుడులు, గుడి మాన్యాలు మింగేస్తున్న నాయకుడిని ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం అభివృద్దిని కాలదన్నినట్లే అయ్యిందన్నారు.
రైతుబంధు, రైతుబీమా, దళితబంధు అన్ని బంధుల్లో ఈ రాబంధులుగా వీళ్ల జేబులు నింపుకుంటున్నారన్నారు. ఆనాడు పరిగి ఎమ్మెల్యేగా లేకుండానే ఆనాటి ముఖ్య మంత్రికిరణ్ కుమార్ రెడ్డిన పరిగి తీసుకువచ్చి హాస్టల్ లో బస చేయించి పరిగి అభివృద్దికి 5 కోట్లు తీసుకువచ్చి అభివృద్ది చేసిన గొప్ప నాయకత్వం టీఆర్ఆర్ అని పొగిడారు. తెలంగాణలో జిల్లా నుంచి రాష్ర్ట రాజకీయాలను శాసించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.
వికారాబాద్ జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగుర వేయడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, పార్టీ పటిష్టతకు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. దేశ రాజకీయాలను శాశిస్తూ, బీ ఫాంలపై సంతకం పెట్టే అధికారం ఈ గడ్డకే వచ్చిందని మన గడ్డ పరువు, ప్రతిష్టతను నిలుపుకోవాల్సిన బాధ్యత అందరికిపై ఉందన్నారు.
అనంతరం డీసీసీ అధ్యక్షులు టి.రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు తనకు సహకరిస్తున్న ప్రతి కార్యకర్తకు రుణపడి ఉంటానన్నారు. మన పార్టీ అధికారంలోకి మరింత అభివృద్ది చేసుకుందామని అభివృద్ది, సేవా ధ్యేయంగా పనిచేస్తున్న తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఆర్ సతీమని ఉమా టీఆర్ఆర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.హన్మంతు ముదిరాజ్, భీంరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు బి.పరశురాంరెడ్డి, బీఎస్ ఆంజనేయులు, అల్పటి అశోక్, సురేందర్, లాల్ కృష్ణ ప్రసాద్, ఎజాజ్, రియాజ్, అక్బర్ పాల్గొన్నారు.