- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అడుగడుగునా గుంతలు.. ఆదమరిస్తే అంతే సంగతులు
దిశ, మోమిన్పేట్ః మోమిన్ పేట నుంచి శంకర్ పల్లి వరకు గల రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి వాహనదారులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. రంగారెడ్డి వికారాబాద్ జిల్లా సరిహద్దుల మధ్య హైదరాబాద్-వికారాబాద్ మధ్య ఉన్న ఈ రోడ్డు చాలా ఇబ్బందికరంగా మారింది. హైదరాబాద్ నగరంలో నివాసముండే ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నత స్థాయి అధికారులు రోడ్డు పరిస్థితి చూసి మోమిన్ పేట మర్పల్లి బంటారం మండలాలలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్లాలంటే శంకర్పల్లి మీదుగా కాకుండా చేవెళ్ల వికారాబాద్ మీదుగావెళుతుంటారు. రోడ్డుపై అడుగడుగునా గుంతలు ఉండడంతో వర్షం పడితే రోడ్డుపై వెళ్లాలంటే కూడా వాహనదారులు ఇబ్బంది పడేవారు. శంకర్ పల్లి నుంచి మహాలింగాపురం లక్ష్మారెడ్డి గూడెం దేవరంపల్లి బాల్రెడ్డిగూడెం ఎంకతల చీమలదరి మైతాఫ్ ఖాన్ గూడా తదితర గ్రామాలతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు ఈ రహదారిపై వెళ్లాలంటే భయపడుతున్నారు.