- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అమ్మో కరెంటోళ్ల.. వాళ్లతో పెట్టుకుంటే అంతే
దిశ, అబ్దుల్లాపూర్ మెట్ : పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ పరిధి విద్యుత్ అధికారుల, సిబ్బందితోపని చేయించుకోవాలంటే ప్రజలు హడలెత్తుతున్నారు. చిన్న పనికి సైతం వేళల్లో ముట్ట చెప్తేకానీ సిబ్బంది ముందుకు వెళ్లడంలేదు. వారు చెప్పినంత ఇయ్యకపోతే పనులు ఎక్కడికక్కడ నిలిపివేస్తున్నారు. సిబ్బంది నిర్వాకంతో పై అధికారులకు తమగోడు చెప్పుకునేందుకు ప్రజలు వెళ్తే ప్రతి విషయాన్ని తమదృష్టికి తీసుకురావద్దని తాము ఇక్కడ కాకుంటే ఎక్కడైనా వెళ్లి పనిచేసుకుంటాం తప్ప ప్రతిచిన్న విషయాన్ని మనంతీసుకోలేం అంటూ చేయిదాటవేస్తున్నారు.
ఇటీవల మున్సిపాలిటీ పరిధిలో జరిగిన ఒకటి రెండు అంశాలను పరిశీలిస్తే విద్యుత్ మీటర్ కాలిపోయింది అంటూ కొత్తది మార్చుకోవాలని విద్యుత్ సిబ్బంది తగిన సూచనలు ఇస్తున్నారు. కొత్తమీటర్ రావడానికి సమయం పడుతుంది కాబట్టి మీరే ఇష్టం వచ్చినట్లుగా కనెక్షన్ ఇచ్చుకోండి ఏదైనా ఉంటే మేమే చూసుకుంటాం అంటూ ఉచిత సలహాలు ఇస్తారు. అనంతరం సిబ్బంది తమడిమాండ్లను సదరు యజమానులకు చెప్తున్నారు. కొత్త మీటర్ కనెక్షన్ కాలిపోయిన ప్రాంతంలో కొత్తగా కొత్త మీటర్ పెట్టాలంటే అధికారికంగా సుమారు 1500 నుంచి 2000 వరకు ఖర్చవుతుంది.
కానీ సిబ్బంది సుమారు 10,000 పైగా వసూలు చేస్తున్నారు. అదేంటి అనే ప్రశ్నిస్తే మీరు ఇన్ని రోజులు అక్రమంగా విద్యుత్ వాడుకున్నారు. మేము అడిగిన డబ్బులు ఇవ్వకుంటే 50,000 ఫైన్ రాసి వెళ్దాం అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఐదు, పది వేలతో పోయేదాన్ని 50వేల వరకు ఎందుకు అనుకుంటూ చెల్లిస్తున్నారు. కొంతమంది ధైర్యంచేసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేద్దామని కార్యాలయానికి వెళ్తే ప్రతి చిన్న విషయాన్ని తమదృష్టికి తీసుకురావద్దని ముఖం మీద చెప్పేస్తున్నారు.
పై అధికారులకు కూడా ఫిర్యాదు చేస్తామని ప్రజలు అంటే పై అధికారులకు చెప్పిన ఇదే ఉద్యోగం చేస్తాం. కాకపోతే వేరే ప్రాంతంలోకి వెళ్తాంతప్ప మా ఉద్యోగాలు ఏమీ పోవంటూ తాము చేసిన తప్పులను సైతం ధైర్యంగా చెప్పుకోవడం కొసమెరుపు. కనీసం ప్రజలు చేసే ఫోన్ కాల్స్ సైతం సరిగ్గా స్వీకరించలేని పరిస్థితిలో విద్యుత్ అధికారులు సిబ్బంది ఉన్నారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ఇటువంటి ప్రజలను ఇబ్బందులకు గురి చేసే సిబ్బందిపై, అధికారులపై చట్టపరమైన తీసుకుని ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నారు.