- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- వీడియోలు
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జర్నలిస్టులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలి
దిశ, శంషాబాద్: జర్నలిస్టులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుపుచ్చుకోవాలని సీనియర్ పాత్రికేయులు మద్యం మధుసూదన్, మురళీధర్, అమర్నాథ్ అన్నారు. శనివారం రాజేంద్రనగర్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నిర్వహించిన క్రికెట్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ పాత్రికేయులు మడ్యం మసూదన్, మురళీధర్ అమర్నాథ్ లను రాజేంద్రనగర్ జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోకల్ నుంచి గ్లోబల్ వరకు విప్లవాత్మకమైన మార్పులు వచ్చిన క్రమంలో జర్నలిజం అనేక సవాళ్లను ఎదుర్కొంటుందని, నేటి విలేకరులకు వార్త సేకరణ వార్తలు రాయడమే కాకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందుపుచ్చుకోవాలని పిలపునిచ్చారు. నాడు అక్షరాలు ఆయుధాలు అయితే, నేడు కంప్యూటర్లు ఆయుధాలుగా మారాయని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటూనే అన్ని రంగాల వార్తలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
తెలుగు జర్నలిజంలో రాజకీయ వార్తలకు ఇంకా ప్రాధాన్యత అధికంగా ఉంటుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు అప్పరెడ్డిగూడెం భీమయ్య, దామోదర్ రెడ్డి, భుజంగారెడ్డి, వెంకటేష్, ప్రేమ్ రాజ్, సూర్యనారాయణ, బాలు, సూర్య కిరణ్, ఏపీ చారి, బాబురావు, సుదర్శన్ గౌడ్, యాదగిరి, చందు, విజయ్, లక్ష్మణ్, నగేష్, ఇంద్రసేన, శ్రీనివాస్, రాములు గౌడ్, రవీందర్, రామకృష్ణ, ప్రభాకర్, సతీష్, రవి, పవన్, ఆంజనేయులు, సుజీవన్ రెడ్డి, తిరుమలేష్, ప్రశాంత్ రెడ్డి, కృష్ణ, శ్రీకాంత్, శివ చరణ్ గౌడ్, అనిల్, నరసింహ, మధు, వినయ్ పాల్గొన్నారు.