- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రూప్-4 అప్లికేషన్.. అయోమయంలో ఆ రెండు గ్రామాల యువకులు
దిశ బొంరాస్ పేట్: గ్రూప్-4,హాస్టల్ వార్డెన్ అప్లికేషన్ లను ఏ జిల్లాలో, ఏ మండలంలో దరఖాస్తు చేసుకోవాలనో పోలేపల్లి, హకీంపేట్ గ్రామాల విద్యార్థులు అయోమయంలో ఉన్నారు. ఈ రెండు గ్రామాలు ఇంతకు ముందు నారాయణపేట జిల్లా, కోస్గి మండలంలో ఉండేవి. వికారాబాద్ జిల్లాలో కొత్త మండలంగా దుద్యాల ఏర్పడింది. ఈ మండలంలోకి కోస్గి మండలంలోని పోలేపల్లి, హకీంపేట్ గ్రామాలను చేర్చారు. నూతన దుద్యాల మండలంలో ఒక్కొక్కటిగా కార్యాలయాల సేవలు, అందుబాటులోకి వస్తున్నాయి. అయితే టీఎస్పీఎస్సీ (TSPSC) వెబ్ సైట్ లో దుద్యాల మండలం కనిపించకపోవడంతో , అప్డేట్ చేయకపోవడం వల్ల ఈ రెండు గ్రామాల యువకులు గ్రూప్-4 దరఖాస్తులు చేసుకోవడానికి, ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే జేఎల్ దరఖాస్తు గడువు అయిపోయిందని విద్యార్థులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు దీనిపై దృష్టి సారించి, సమస్యను పరిష్కరించాలని ఆ గ్రామాల యువకులు కోరుతున్నారు.