ప్రభుత్వ భూముల్లోని అక్రమ నిర్మాణాల కూల్చివేత..

by Sumithra |
ప్రభుత్వ భూముల్లోని అక్రమ నిర్మాణాల కూల్చివేత..
X

దిశ, శంషాబాద్ : ప్రభుత్వ భూములు ఆక్రమించి నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని రాజేంద్రనగర్ తహసీల్దార్ చంద్రశేఖర్ గౌడ్ హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్ లోని సర్వేనెంబర్ 424, 467 లో కొందరు వ్యక్తులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారనే పిర్యాదు వచ్చిందన్నారు. దీంతో తహసీల్దార్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు శుక్రవారం జేసీబీలతో అక్రమ నిర్మాణాలను పూర్తిగా కూల్చివేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూములు చెరువులు, కుంటలు నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వ భూములలో నిర్మాణాలు చేపడితే కూల్చివేతలు తప్పు అని హెచ్చరించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిపై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామన్నారు. మరోసారి అక్రమ నిర్మాణాలు చేపడితే క్రిమినల్ చేసిన నమోదు చేస్తామన్నారు.

Advertisement

Next Story