- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భూ కబ్జాదారుల పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు..
దిశ, శంషాబాద్ : తాను కొనుగోలు చేసిన భూమిని రియల్ టర్ కబ్జా చేయడంలో కీలక పాత్ర పోషించిన సర్పంచ్ తో పాటు సహకరించిన అధికారుల పై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ దళిత సీనియర్ నాయకురాలు, రైతు మైలారం సులోచన డిమాండ్ చేశారు. గురువారం రంగారెడ్డి జిల్లాశంషాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రైతు మైలారం సులోచన మాట్లాడుతూ శంషాబాద్ మండలంలోని మదనపల్లి కొత్త తాండ గ్రామపంచాయతీ పరిధిలోని సర్వేనెంబర్ 50/69, 50/85 లో అప్పటి పట్టాదారు అమూల్య అనే వ్యక్తి వద్ద 4 ఎకరాల పొలాన్ని కొనుగోలు చేశామన్నారు.
సంబంధిత యజమానులకు పట్టా పాస్ పుస్తకాలు లేకపోవడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కాలేదన్నారు. అదే సమయంలో ఓ రియల్టర్ చైతన్య కిరణ్ తో పాటు అధికారులు, సర్పంచ్ కొర్ర దేవా, బీఆర్ఎస్ నాయకుల అండదండలతో ఇల్లు లేకున్నా ఇంటి నెంబర్లు ఉన్నట్లు చేసి జీపీఏ చేసుకున్నారన్నారు. ఈ విషయం పై శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశామని ఇచ్చిన ఫిర్యాదు మేరకు రియాల్టర్ చైతన్య కిరణ్ తో పాటు మరికొంతమందిపై కేసులు కూడా నమోదయ్యాయని అన్నారు. ఇండ్లు లేకున్నా అక్రమంగా ఇంటి నెంబర్ ఇవ్వడంతో పాటు ఎలాంటి పరిశీలన లేకుండా రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్టర్ పై ఉన్నత అధికారులు విచారణ చేపట్టి కేసులునమోదు చేయాలన్నారు. ఈ వ్యవహారం పై జిల్లా కలెక్టర్, ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేస్తామన్నారు. అధికారుల పై సత్వరమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.