అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ గెలవాలి : Manchireddy Kishan Reddy

by Kalyani |   ( Updated:2023-11-18 11:55:27.0  )
అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ గెలవాలి : Manchireddy Kishan Reddy
X

దిశ, యాచారం : గ్రామాలలో అభివృద్ధి కొనసాగాలంటే ప్రజలు మరొక్కసారి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మంచి రెడ్డి కిషన్ రెడ్డి కోరారు. శనివారం మండల పరిధిలోని గున్ గల్, గడ్డ మల్లయ్య గూడ గ్రామాలలో రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్ తో రోడ్ షోలు నిర్వహించి చౌరస్తాల దగ్గర మాట్లాడారు..గత ప్రభుత్వాల పాలకులతో పోల్చుకుంటే కేసీఆర్ పాలనలో గ్రామాలు శరవేగంగా అభివృద్ధి చెందాయని గుర్తు చేశారు. ప్రతి గల్లీకి సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ, ఇంటింటికి నల్లా నీళ్లు, నూతనంగా నిర్మించిన బీటీ రోడ్లు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ద్వామాలు 24 గంటల కరెంటు అందుకు నిదర్శనం అన్నారు. నర్రె మల్లేష్ గడ్డం మల్లయ్యగూడ గ్రామానికి చేసిన సేవలు మరువలేనివని జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చాయని కొనియాడారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే గోసపడుతారని అభివృద్ధి కొనసాగాలంటే కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ చిన్నోళ్ల చంగమ్మ యాదయ్య, పిఎస్.సిఎస్ చైర్మన్ తోటి రెడ్డి రాజేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story