ధోనీపై, సీఎస్కేపై సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు.. ధోనీ నాటౌట్ అయిన పెద్దగా ఒరిగిదేం లేదంటూ కామెంట్స్

by Harish |
ధోనీపై, సీఎస్కేపై సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు.. ధోనీ నాటౌట్ అయిన పెద్దగా ఒరిగిదేం లేదంటూ కామెంట్స్
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-18లో భాగంగా శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నయ్ సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ అవుటైన తీరు వివాదాస్పదమైంది. నరైన్ వేసిన బౌలింగ్‌లో మాహీ ఎల్బీడబ్ల్యూ అవ్వగా.. అల్ట్రా ఎడ్జ్‌లో బంతి బ్యాటుకు తాకినట్టు స్పైక్స్ వచ్చినా థర్డ్ అంపైర్ అవుట్ ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ.. ధోనీపై, సీఎస్కేపై కీలక వ్యాఖ్యలు చేశాడు.

ధోనీ నాటౌట్‌ అయినంత మాత్రాన చెన్నయ్ రాత మారేది కాదని వ్యాఖ్యానించాడు. ‘పెద్దగా డిఫరెన్స్ ఉంటుందని అనుకోను. అతను నాటౌట్ అయి ఉంటే సీఎస్కే ఎంత స్కోరు చేసేది. మహాయితే 130 పరుగులు చేసేదేమో. 104 పరుగుల లక్ష్యాన్ని 10.1 ఓవర్లలోనే ఛేదించిన కేకేఆర్ 130 పరుగులు కొట్టడానికి పెద్దగా కష్టపడేది కాదు.’ అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. కాగా, ఆ మ్యాచ్‌‌లో చెన్నయ్ 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ సీజన్‌లో పేలవ ప్రదర్శన చేస్తున్న సీఎస్కే వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది.


Next Story

Most Viewed