PDSU ఆధ్వర్యంలో భగత్ సింగ్ 92వ వర్థంతి పోస్టర్ విడుదల

by Javid Pasha |
PDSU ఆధ్వర్యంలో భగత్ సింగ్ 92వ వర్థంతి పోస్టర్ విడుదల
X

దిశ, చేవెళ్ల: మార్చి 23న భగత్ సింగ్ వర్థంతి సందర్భంగా పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఖానాపురం రాజేశ్ పోస్టర్ ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 92 ఏళ్ల కిందట నాటి బ్రిటిష్ ప్రభుత్వం భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లను ఉరి తీసిందని గుర్తు చేశారు. దేశంలో జరుగుతోన్న మత విద్వేషాలకు వ్యతిరేకంగా దేశ భక్తిని పెంపొందించుకోవాలంటే అలాంటి మహనీయుల జయంతి, వర్థంతిలను జరుపుకోవాలని సూచించారు.

వలస పాలకుల వెన్నులో దడ పుట్టించి 23 ఏళ్లకే ఉరికొయ్యలను ముద్దాడిన భగత్ సింగ్ ను నేటి యువత ఆదర్శంగా తీసుకొని హక్కుల గురించి పోరాడాలని పిలుపనిచ్చారు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల త్యాగ ఫలితమే నేడు మనం అనుభిస్తున్న స్వేచ్ఛ అని అన్నారు. ఈ కార్యక్రమంలో PDSU జిల్లా నాయకులు సురేష్, శ్రీకాంత్, గోపాల్, మరియు హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed