బిగ్ న్యూస్: కవిత ప్రతినిధినే అని అంగీకరించిన పిళ్లై.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీకి బిగుస్తున్న ఉచ్చు..?

by Satheesh |
బిగ్ న్యూస్: కవిత ప్రతినిధినే అని అంగీకరించిన పిళ్లై.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీకి బిగుస్తున్న ఉచ్చు..?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన హైదరాబాద్ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైకి కోర్టు ఈ నెల 13 వరకు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. నిన్న రాత్రి పిళ్లైని అదుపులోకి తీసుకున్న ఈడీ మంగళవారం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచి ఏడు రోజుల కస్టడీ కోరింది. ఈ సందర్భంగా కోర్టులో వాదనలు వినిపించిన ఈడీ.. ఈ కేసులో రామచంద్ర పిళ్లై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రతినిధిగా వ్యవహరించారని, తాను కవిత ప్రతినిధి అని పిళ్ళైనే అంగీకరించాడని కోర్టు దృష్టికి తీసుకు వచ్చింది.

ఈ వ్యవహారంలో పిళ్లై రూ.25 కోట్లు నేరుగా ట్రాన్స్ఫర్ చేశాడని, సౌత్ గ్రూప్ చెల్లించిన కిక్ బ్యాక్ అమౌంట్ పంపిణిలో పిళ్లైది ప్రధాన పాత్ర అని.. అరుణ్ పిళ్ళైతో బుచ్చి బాబును కలిపి విచారించాల్సి ఉందని తెలిపింది. లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్ సాక్ష్యం ఉన్న తర్వాత పదే పదే పిలిచి ఎందుకు ప్రశ్నలు అడుగుతున్నారు. నేరుగా అరెస్ట్ చేయవచ్చు కదా అని జడ్జి ఈడీని ప్రశ్నించారు. పిళ్లై తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 29 రోజులు విచారణ జరిపారని.. ఈడీ అడిగిన వాటన్నింటికి పిళ్లై సమాధానాలు ఇచ్చారని కోర్టుకు తెలిపారు.

అరుణ్‌కు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని థైరాయిడ్, మజిల్ పెయిన్ కిల్లర్ మెడిసిన్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అతడి తల్లి ఆరోగ్య పరిస్థితి కూడా బాగోలేదని కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబం సభ్యులతో ఫోన్‌లో మాట్లాడటానికి అనుమతి కోరగా అరుణ్ పిళ్ళై భార్య, బావ మరిదిని కలవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. వాదనలు ముగియడంతో కోర్టు ఎలాంటి ఆర్డర్‌పై సస్పెన్స్ నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed