అక్బరుద్దీన్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయను: రాజాసింగ్

by GSrikanth |   ( Updated:2023-12-08 09:26:44.0  )
అక్బరుద్దీన్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయను: రాజాసింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రొటెమ్ స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ను నియమిస్తే ఆయన సమక్షంలో తాను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసే ప్రసక్తే లేదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీకి పూర్తి స్థాయి స్పీకర్ వచ్చిన తర్వాతే ఆయన ఛాంబర్‌లో తాను ప్రమాణ స్వీకారం చేస్తానన్నారు. కాగా, రాజాసింగ్ 2018 ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా ఆయన ప్రొటెమ్ స్పీకర్ వద్ద ప్రమాణ స్వీకారం చేయలేదు. అప్పట్లో ప్రొటెమ్ స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ వ్యవహరించగా దేశం, ధర్మం పట్ల గౌరవం లేని పార్టీకి ఇచ్చారని ఆరోపించారు. దీంతో ముంతాజ్ ఖాన్ సమక్షంలో కాకుండా పూర్తి స్థాయి స్పీకర్‌గా పోచారం శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాతే స్పీకర్ ఛాంబర్‌లో ప్రమాణ స్వీకారం చేశారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story