Raja Singh: నాకు బ్రోకరిజం చేయడం రాదు.. మరోసారి రాజాసింగ్ సెన్సేషనల్ కామెంట్స్

by Shiva |
Raja Singh: నాకు బ్రోకరిజం చేయడం రాదు.. మరోసారి రాజాసింగ్ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ (BJP)లో జిల్లా అధ్యక్షుల నియామకం ఆ పార్టీలో చిచ్చుపెట్టింది. ఎమ్మెల్యే (MLA's), ఎంపీ (MPS's)లు సూచించిన విధంగా అధ్యక్షుల ఎంపిక జరగకపోవడంతో కీలక నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే తాను సపోర్ట్ చేసిన నేతకు గోల్కొండ- గోషామహల్ (Golconda- Goshamahal) ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh) పార్టీపై ఇవాళ మరోసారి సంచలన వ్యాఖ్యలు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల తాను పార్టీలో వేధింపులు తట్టుకోలేకపోతున్నానని రాజాసింగ్ కామెంట్ చేశారు. పార్టీకి తన అవసరం లేదని చెబితే ఇప్పటికిప్పుడే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తానని అన్నారు.

బీజేపీ (BJP)ని వదిలి వెళ్లేందుకైనా తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. పార్టీలో కొంతమంది చేస్తున్నట్లు తనకు బ్రోకరిజం చేయడం రాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. గోల్కొండ-గోషామహల్ (Gokonda-Goshamahal) జిల్లా బీజేపీ (BJP) అధ్యక్ష పదవిని బీసీ లేదా ఎస్సీ వ్యక్తికి ఇవ్వాలని సూచిస్తే.. కనీసం తనను పట్టించుకోకుండా ఎంఐఎం (MIM) పార్టీ నేతలతో అంటకాగే వ్యక్తికి అధ్యక్ష పదవిని కట్టబెట్టారని ఫైర్ అయ్యారు. అలా చేశారని పార్టీలో ఉన్న ఓ ముఖ్య నేతను ప్రశ్నిస్తే.. నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని కామెంట్ చేశారు. తన నియోజకవర్గంలో కాకుండా హైదరాబాద్ (Hyderabad) పరిధిలో ఇప్పటికే తాను కాంగ్రెస్ పార్టీ (Congress Party)తో యుద్ధం చేస్తున్నానని అన్నారు. గోల్కొండ-గోషామహల్ (Gokonda-Goshamahal) జిల్లా అధ్యక్ష పదవిని తాను సూచించిన వ్యక్తికి ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.



Next Story

Most Viewed