Rain Alert: వాతావరణ శాఖ కీలక సూచన.. నేడు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు!

by Shiva |   ( Updated:2024-09-30 12:52:14.0  )
Rain Alert: వాతావరణ శాఖ కీలక సూచన.. నేడు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: నైరుతి రుతుపవనాల తిరోగమనం ఎఫెక్ట్‌తో శనివారం రాత్రి హైదరాబాద్‌ నగరం (Hyderabad City)లో కుండపోత వర్షం కురిసింది. ఈ క్రమంలోనే తాజాగా వాతావరణ శాఖ (Department of Meteorology)మరో కీలక సూచన చేసింది. రాబోయే 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. అక్కడక్కడ గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా ఐఎండీ తెలిపింది. అదేవిధంగా భద్రాద్రి, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా జిల్లాల్లో ఐఎండీ అధికారుల ఇప్పటికే ఎల్లో అలర్ట్ (Yellow Alert) జారీ చేశారు.

Advertisement

Next Story

Most Viewed