- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Gurukula : రేవంతన్న.. ఈ అక్క చెల్లెలకు న్యాయం చేయండి: సీఎం ఇంటి వద్ద వినూత్న నిరసన
దిశ, డైనమిక్ బ్యూరో: గురుకుల 1:2 అభ్యర్థులు వినూత్న నిరసన చేపట్టారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ ఇంటి ముందు పిల్లలతో సహా వెళ్లి తమ సమస్యలు పరిష్కరించాలని వారు ముఖ్యమంత్రిని వేడుకున్నారు. రాఖీ పండగ సందర్భంగా ఈ అక్కచెల్లెలకు న్యాయం చేయాలంటూ సీఎంకు రాఖీ శుభాకాంక్షలతో ఫ్లెక్సీలు ప్రదర్శించారు. గురుకులాల్లో డౌన్‌మెంట్ లిస్ట్ ఆపరేట్ చేయాలని కోరారు. గురుకుల బోర్డు చేపట్టిన నియామకాల్లో 9210 పోస్టులు డిసెండింగ్ ఆర్డర్ పాటించకపోవడం, వివిధ నోటిఫికేషన్లకు సంబంధించిన పోస్టుల కేడర్ వేరు అయినప్పటికీ కూడా కొన్ని పేపర్లు ఉమ్మడిగా నిర్వహించడం వల్ల చాలా మంది అభ్యర్ధులకు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయని అభ్యర్థులు చెబుతున్నారు.
ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఒక ఉద్యోగంలో మాత్రమే చేరుతారని, దీంతో 2,500 పోస్టులు భర్తీ కాకుండా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇలా మిగిలిన పోస్టులను తదుపరి మెరిట్ అభ్యర్ధులతో భర్తీ చేసే విధంగా ఇదివరకే ఉన్న సుప్రీంకోర్టు తీర్పులు ఆధారంగా చేసుకుని ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో మార్చి నెలలో మధ్యంతర ఉత్తర్వులు వచ్చాయని గుర్తుచేశారు. అయిన కూడా కోర్టు తీర్పు అమలు చేయకుండా గురుకుల బోర్డు కాలయాపన చేస్తోందని ఆరోపించారు. కాబట్టి గురుకుల నియామకాల్లో పోస్టులు మిగిలిపోకుండా నెక్ట్స్ మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేసే విధంగా తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.