ప్రజా ఖజానా నుంచి ఒక్క పైసా ఖర్చు పెట్టొద్దు.. బాధ్యత మొత్తం వాళ్లదే!

by GSrikanth |
ప్రజా ఖజానా నుంచి ఒక్క పైసా ఖర్చు పెట్టొద్దు.. బాధ్యత మొత్తం వాళ్లదే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని, ఇందుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని తెలంగాణ జల సాధన సమితి రౌండ్ టేబుల్ మీటింగ్‌లో వక్తలు డిమాండ్ చేశారు. ఇవాళ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ జల సాధన సమితి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరామ్, జస్టిస్ చంద్రకుమార్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు, ఇంజనీర్లు, సామాజిక వేత్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వానికి భజన పరులుగా ఉన్న ఇరిగేషన్ ఉన్నతాధికారులను తక్షణమే తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీల్లో ఏది కుంగినా నిర్మాణ సంస్థదే బాధ్యత అని చెప్పారు. ప్రజా ఖజానా నుంచి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టవద్దన్నారు. ప్రభుత్వానికి ఎల్‌అండ్‌టీ సంస్థ రాసిన లేఖను తక్షణం బయటపెట్టాటన్నారు.

Advertisement

Next Story